ఇది చూసారా? అమ్మ, నాన్న అప్పుడే పుట్టి ఇంకా కళ్ళు కూడా తెరవని పిల్లకు పుస్తకం చూపించి మురిసిపోతున్నారు. అయితే ఏంటి ఆ పుస్తకం? వామ్మో.. పిల్లని ఐన్స్టీన్ని చేద్దామని అప్పుడే కలలు అల్లేస్తున్నట్లున్నారేం ! అట్లా ఊహలు అల్లితే పాప కనీసం ఐఐటీకైనా వెళ్తుందని ఆలోచనేమో. ఓసారి ఊహించండి- నిజంగానే అలా జరిగితే ఏమౌతుంది? ఇప్పుడే పుట్టిన పిల్లలకోసం ఐఐటీ కోచింగులు, యంఐటీ టెస్టు కిట్లు ఇస్తే ఎలా ఉంటుంది ?! మీ ఆలోచనల్ని కథలాగా రాసి పంపగలరేమో చూడండి. చక్కని కథకు చక్కని బహుమతి!