అడ్డం-నిలువు ఆధారాల సహాయంతో ఈ గడులను నింపగలరేమో చూడండి. నింపిన పదరంగాన్ని పోస్టుకార్డుమీద రాసిగాని, లేదా స్కాన్/ఇ-మెయిలు ద్వారాగాని మాకు అందేట్లు పంపండి. మీ బడి పేరు, మీవాళ్ల ఫోను నంబరు తప్పక రాయండి. సరైన సమాధానం రాసి ఎంపికైన ముగ్గురు పిల్లలకు కొత్తపల్లి-72 ముద్రిత ప్రతిని బహుమతిగా పంపిస్తాం! అయితే ఈ సదుపాయం ఉన్నది, భారత దేశంలోని పిల్లలకు మాత్రమే!