అనగనగా ఒక ఎడారిలో ఒక ఒంటె ఉండేది. ఒక రోజు మధ్యాహ్నం. అది దప్పిక తీర్చుకోవడానికి ఒక కొలనుకు వెళ్ళింది. అది తిరిగి వచ్చేటప్పుడు దాని కాలికి ఒక పదునైన ముల్లు గుచ్చుకుంది. బాధతో అది అరిచింది. ముల్లు తీసుకోవడానికి ప్రయత్నించింది. దాని వల్ల కాలేదు. అప్పుడే అక్కడకు ఒక కుందేలు వచ్చింది.
కుందేలు ఒంటె బాధ చూసి జాలి పడింది. మెల్లగా దాని దగ్గరకు వెళ్ళి ముల్లు తీసివేసింది. ఒంటె కుందేలుకు కృతజ్ఞతలు తెలిపింది.
కొన్నాళ్ళు గడిచాయి. కుందేలు ఒక బొరియ తవ్వుతూ ఉంది. హఠాత్తుగా ఒక నక్క అక్కడికి వచ్చింది. కుందేలు మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. నక్కను చూసి కుందేలు భయంతో కేకలు పెట్టింది.
అప్పుడు ఆ దారి వెంట ఒంటె వెళుతూ ఉంది. కుందేలు అరుపులు విని అది త్వరగా దాని దగ్గరకు వచ్చింది. కుందేలును పైకి ఎత్తి మెల్లిగా తన వీపు మీద కూర్చో బెట్టుకుంది.
ఒంటెను చూసి హడలెత్తి నక్క పారి పోయింది. కుందేలు ఒంటెకు కృతజ్ఞతలు చెప్పించి. ఆరోజు నుండి కుందేలు, ఒంటె మంచి స్నేహితులుగా కలిసి మెలిసి జీవించాయి.