ఎన్నెన్నో పండగలొస్తై
ఎగసిపడే ఉత్సాహంతో
ఎనలేని ఆనందం
ఏడంతా పిల్లలకిస్తై
సంబరాల సంక్రాంతొచ్చె-
ఊరువాడకుల్లాసమిచ్చె
సేద్యం చేసే రైతన్నల
సేదతీర్చే మూన్నాళ్ల పండగ
చేసిన శ్రమ ఫలితంగా
సిరి చేరు ధాన్యమై రైతులిళ్ళ
తీరిచి దిద్దిన ముగ్గుల్లు
తీరుగ కన్నెలు పెట్టిన గొబ్బిళ్ళు
కురిసే మంచు తొలి పొద్దుల్లో
హరిని కీర్తిస్తూ తిరుగు దాసుళ్ళు
ముగురున బట్టలు ముంగాళ్ల గజ్జెలు
ముంగిట చిందేయు బసవళ్ళు ఎటుకన్నా
సంక్రాంతి సమయాన!