చిట్టి కవిత
మిరపకాయ కారం
చింతకాయ పులుపు
కమలకాయ తీపి
కాకరకాయ చేదు
(కార్తిక్,6వతరగతి,రిషివ్యాలీస్కూల్,మదనపల్లి,చిత్తూరుజిల్లా.)
ఎందుకబ్బా?!
ఎలుగు బంట్ల బొచ్చు అంత దుబ్బగా ఎందుకుంటుంది?
అడవిలో వాటికి హెయిర్‌కట్ చేసేవాళ్లు ఎవరూ ఉండరు కదా, అందుకని!
ఎన్ని ఫోర్డులు?!
బంటి: ఫోర్డ్ అంటే ఏమిటి?
చంటి: అదొక కారుపేరు.
బంటి:మరి,ఆక్స్ ఫోర్డ్ అంటే?
చంటి: అది కూడా తెల్దా? అదొక ఎడ్లబండి పేరు!
నేనే పెద్ద!
బన్ని:డాడీ! ఒకటి పెద్దదా?ఇరవైపెద్దదా?
డాడీ:ఇరవయ్యే పెద్దది, దేనికిరా అడిగావ్!
బన్ని:మరేంలేదు...నాకు మా క్లాసులో ఇరవయ్యేవ ర్యాంకు వచ్చిందిలే, అందుకని!