సేకరణ: సి.రామచంద్ర, నాలుగవ తరగతి, శ్రీ మారుతి విద్యా నికేతన, చెన్నే కొత్తపల్లి, అనంతపురం జిల్లా.
ప్రగతి, తొమ్మిదవ తరగతి, వెంకటం పల్లి.
1. రెక్కలుండు కాని పక్షి కాదు.ఏమిటది?
2. తొండం ఉంటుంది కాని ఏనుగుకాదు.ఏమిటది?
3. కంఠము నందు నలుపు ఉండును కాని శివుడు కాదు.ఏమిటది?
4. కాళ్లు ఉండవు కాని నడుస్తుంది, కండ్లు ఉండవు కాని ఏడుస్తుంది-ఏమిటది?
5. తెల్ల మనిషికి నల్ల టోపీ-ఏమిటది?
6. ఒక కట్టెకు ఒక కొండ-ఏమిటది?
7. చాటనిండా బొరుగులు, ప్రొద్దున్నే చూస్తే లేవు- ఏమిటవి?
8. గుంపు చెట్లల్లో కారు పోయెను- ఏమిటది?
9. బయట వెండి; లోనబంగారం-ఏమిటది?
10. కాలులేని పిల్లవాడు కొండ ఎక్కెను- ఏమిటది?