తరలిపో, తరలిపో, తరలిపో!
తరలిపో, తరలిపో, తరలిపో!
ఆ చల్లని కోనలోకి - ఆ పచ్చని కానలోకి
తరలిపో, తరలిపో, తరలిపో!
మరలనుండి రొదలనుండి మరలిపో
మర బ్రతుకుల వెతలనుండి మరలిపో
మరలిపో మరలిపో!
తరలిపో, తరలిపో, తరలిపో!
అట ప్రతి మలుపూ హరిత రాగ సంచారం
అట ప్రతి తరువూ నవ వసంత దరహాసం
కొండమోముపై జారును మేలిముసుగు తుషారం
కోనలలో జాలువారు నీల మేఘ మల్హారం
ఆ చల్లని కోనలోకి - ఆ పచ్చని కానలోకి
తరలిపో, తరలిపో, తరలిపో!
మరలనుండి రొదలనుండి మరలిపో
మర బ్రతుకుల వెతలనుండి మరలిపో
మరలిపో మరలిపో!
తరలిపో, తరలిపో, తరలిపో!
వెండివాగు పలికించును జలతరంగిణి
వేణుకుంజమాలపించు రాగరాగిణి
నింగినంటు తరులలో వాయులీన హేల
లోయలలో పరచుకున్న మౌనస్వరమేళ
ఆ చల్లని కోనలోకి - ఆ పచ్చని కానలోకి
తరలిపో, తరలిపో, తరలిపో!
మరలనుండి రొదలనుండి మరలిపో
మర బ్రతుకుల వెతలనుండి మరలిపో
మరలిపో మరలిపో!
తరలిపో, తరలిపో, తరలిపో!