1. రెక్కలుండు కాని పక్షి కాదు.ఏమిటది? 2. తొండం ఉంటుంది కాని ఏనుగుకాదు.ఏమిటది? 3. కంఠము నందు నలుపు ఉండును కాని శివుడు కాదు.ఏమిటది? 4. కాళ్లు ఉండవు కాని నడుస్తుంది, కండ్లు ఉండవు కాని ఏడుస్తుంది-ఏమిటది? 5. తెల్ల మనిషికి నల్ల టోపీ-ఏమిటది? 6. ఒక కట్టెకు ఒక కొండ-ఏమిటది? 7. చాటనిండా బొరుగులు, ప్రొద్దున్నే చూస్తే లేవు- ఏమిటవి? 8. గుంపు చెట్లల్లో కారు పోయెను- ఏమిటది? 9. బయట వెండి; లోనబంగారం-ఏమిటది? 10. కాలులేని పిల్లవాడు కొండ ఎక్కెను- ఏమిటది?