పదరంగం-7
ఈ పదరంగం చాలా సులభం! దీన్ని పూరించి పంపండి. మీ పేరుతో బాటు మీ బడి పేరు, తరగతి తప్పక రాయండి. సరైన సమాధానాలు పంపిన పిల్లల పేర్లను పదరంగం-8 తో పాటు ప్రచురించగలం.
నిర్వహణ: దేవి, కొత్తపల్లి బృందం.
ఆధారాలు:
అడ్డం:
1. సమాధానం(3) 3. రమ్మని రెండు సార్లు పిలు! (2) 5. రచనలు చేసేవాడు (4) 7. దగ్గర (2) 9. రాక్షసుడి చెల్లి (3) 11. ఇనుప వస్తువులను ఆకర్షించేది(4) 12. రోజు (2)
నిలువు:
1. రక్తం పీల్చుకునే పురుగు (3) 2. వానా కాలంలో కాళ్లకి అంటుకునేది(3) 3. రాళ్ళు- ఏకవచనం (2) 4. 'వ్రాత'ని ఇలా రాస్తారు (2) 6. గజిబిజిగా 'రామచరితం'(5) 8. ప్రయాణం (3) 10. చలన చిత్రం (2) 11. ఇది కాదు (2)
పదరంగం-6 కి సరైన సమాధానం
దీనికి చక్కగా సమాధానాలు వ్రాసి పంపించిన పిల్లలు:
1. నందన ఏ.యస్, 4వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
2. అసంగానంద రెడ్డి, 4వ తరగతి, అజంతా స్కూల్, నెల్లూరు.
3. జి.సత్యలక్ష్మి, 2వ తరగతి, ఇంటి బడి, చెన్నేకొత్తపల్లి.