1."సన్న" గా వున్న మనవణ్ణి అమ్మమ్మ ప్రేమతో ఎలా పిలుస్తుంది?
పిచ్చి "సన్నా"సి!!
2.రాబోయే తరానికి మంచి వ్యాపార సూచన ఏమిటి!?
"ఆక్సిజన్" బార్!!
3.(చీకటి) 'DARK స్పెల్లింగు తప్పు రాశావేరా' అని అరిచిన మేస్టారు అదిరి పడేదెప్పుడు!?
'చీకట్లో మీకు కనపడదనుకున్నాను సార్ ' అని విద్యార్థి అన్నప్పుడు!!
4."అజ్ఞానం" అంటే ....!?
'నాకు అన్నీ తెలుసు ' అనుకోవటం!!
5.గాయకుడు వేలంపాటలో పాల్గొంటే....!?
పాట రక్తి కడుతుంది!!
6.తెలివైన వ్యాపారి స్లోగన్...!?
పువ్వులు కొంటే సువాసన ఉచితం!!
7.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డాక్టర్ దగ్గర కెళ్తే ....!?
బి.పి చెక్ చేసి మీకు 'సైబర్ టెన్షన్ ' అంటాడు!!