రైటు తర్వాత వచ్చేది లెఫ్టే!
టీచర్: రామూ! విమానాన్ని ఎవరు కనుక్కున్నారు?
రాము : రైట్ బ్రదర్స్ టీచర్!
టీచర్: కరెక్ట్! సోమూ, నువ్వు చెప్పు, రైలును ఎవరు కనుక్కున్నారు?
సోము: లెప్ట్ బ్రదర్స్ టీచర్!
చిలిపి ప్రశ్నలు- తిక్క జవాబులు
ప్రశ్న: పళ్ళు లేని కుక్క కరిస్తే?
జవాబు: సూదిలేని సిరంజ్ తో ఇంజక్షన్ చేయించుకోవాలి!
ప్రశ్న: సెల్ ఫోన్ పోతే ఏమౌతుంది?
జవాబు: మనశ్శాంతి ఫ్రీగా వస్తుంది.
ప్రశ్న: నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?
జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి
పొడుపు కథలు
బంగారు చెంబులో వెండి గచ్చకాయ? పనసతొన
అమ్మ తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామను! చందమామ
ఆకులేని ఆడవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాతుంది! దువ్వెన
ఇల్లుకాని ఇల్లు! బొమ్మరిల్లు
అంగట్లో కొంటారు ముందర పెట్టుకొని ఏడుస్తారు? ఉల్లిపాయ
చీర మీద చీర, పదహారు చీరలు? ఉల్లి పొరలు
కోట కాని కోట ? తులసికోట
(సేకరణ: P. పావని, 5వ తరగతి, వికాస విద్యావనం)
మీకు తెలుసా?
మన దేశంలో మొట్ట మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ) 1950
"ఒరైజా సటైవా" అనేది ఏ మొక్క శాస్త్రీయ నామం?
జ) వరి
మన రాజ్యాంగ నిర్మాణంలో అత్యధిక ప్రభావం చూపిన చట్టం?
జ) 1935 భారత ప్రభుత్వచట్టం
సౌర కుటుంబంలో మొత్తం ఉపగ్రహల సంఖ్య ఎంత?
జ) 162
క్షారాల PH విలువ ఎంత ఉంటుంది?
జ) 7 నుండి 14 వరకు
భారతదేశంలో తొలి ప్రెసిడెన్సీ బ్యాంకు?
జ) బ్యాంక్ ఆఫ్ బెంగాల్
జీర్ణ రసాలలో ఏ ఆమ్లం ఉంటుంది?
జ) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
భారతదేశంలో అతి ఎత్తయిన కాంక్రీట్ డ్యాం ఏది?
జ) నాగార్జునసాగర్