డెభ్బయ్యవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

బ్రిటిష్ వాళ్ళు పదిహేడో శతాబ్దంలో మన దేశానికి వ్యాపారం కోసం వచ్చారు.
రెండు వందల ఏళ్ళు గడిచే సరికి- 1858కల్లా - వాళ్ళు మన దేశాన్ని పూర్తిగా బ్రిటిష్ రాణికి అప్పజెప్పారు.
అప్పటినుండి 1947లో స్వాతంత్ర్యం వచ్చే వరకూ మన దేశం నుండి అపారమైన సంపదల్ని వాళ్ళ దేశానికి తరలించుకు వెళ్తూ పోయారు.
మన పెద్దవాళ్ళంతా కలిసి వాళ్లని జయప్రదంగా తరిమేసి, మనకు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు. ఆ నేపధ్యంలోంచి చదవండి, ఈ మాసపు ముందుమాట- చీమకథ.

పట్టుదలతో మనం దేన్నైనా సాధించచ్చు. అయితే దేన్ని సాధించాలి? దేన్నో ఒక ఉదాహరణగా చెబుతూ శిరీష రాసిన పట్టుదల కథ చాలా బాగుంది- చూడండి.

మీరు మీ దుస్తుల్ని మరీ అమితంగా ప్రేమిస్తున్నారా? అయితే చదివి మారండి, ఆదూరి హైమవతి బామ్మగారు రాసిన మారిన లత కథని.

ఇవి కాక మరి ఇంకా నవ్వించేవి, చదివించేవి మంచి మంచి కథలున్నై ఇందులో- ఆలస్యం ఎందుకు? చదివెయ్యండి!