టీ!
ఉదయాన్నే లేచి తాగేదేమిటీ?

చెప్పు!
పాదరక్షకు మరో పేరు చెప్పు?

సా!
'రంపాన్ని' ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా?

రాయి!
'స్టోన్' ని తెలుగులో ఏమంటారో రాయి!

అడుగు!
'ఫుట్' కి తెలుగు ఏమిటో నీ స్నేహితుడిని అడుగు!

అమ్మా!
'మాత' అంటే ఏమిటో చెప్పమ్మా!

వా!
'రా' ని తమిళంలో ఏమంటారో చెప్పగలవా?

తెలుపు!
ధవళ వర్ణం అంటే ఏ రంగో తెలుపు ?!

రా!
'కమ్' అంటే ఏమిటో చెప్పరా!

వెతుకు!
'సెర్చ్' అనే పదానికి అర్థం ఏమిటో డిక్షనరీలో వెతుకు!