ఆస్వాదించండి ఈ ప్రకృతి సౌందర్యం
ఇది అందరికీ ఓ ఆనంద వరం
వికసించి విరబూసే రంగురంగుల పుష్పాలు
ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన నదులు
ఆనంద గీతికతో, సు-వర్ణ గతితో పరవశింపజేసే పక్షుల గానాలు
ప్రకృతినే మురిపించే పచ్చని పంటలు
మన పల్లెల సౌందర్యం, మదిలో ఓ ఆనందం
ప్రకృతికి ఇదే నా నమస్కారం! నత మస్తకం!