1. అత్యాశ ..?
    టికెట్లు కొనకుండా లాటరీ రావాలని ఆశపడటం!

  2. ఇంగ్లీషులో బటర్ అంటే వెన్న. ఫ్లయ్ అంటే ఈగ. మరి బటర్ ఫ్లయ్ అంటే?
    వెన్న మీద వాలే ఈగ!

  3. విమానాశ్రయందగ్గర బిచ్చగాడు ఏమని అడుక్కున్నాడు?
    ఒక డాలర్ ధర్మం చేయండి బాబూ!

  4. ప్రాణం‌లేకపోయినా కరిచేది ఎవరు?
    చెప్పు!

  5. డ్రైక్లీనింగ్ అంటే..?
    నీళ్ళు లేకుండానే ఉత్తుత్తిగా బట్టలు ఉతకటం!

  6. వార్తలు వినే అలవాటున్న టీచరు, క్లాసు ముగించే ముందు ఏమంటుంది?
    ముఖ్యాంశాలు మరోసారి!

  7. ఎండమావి అంటే‌ఏంటి?
    ఎండలో ఉన్న మామిడి చెట్టు!

  8. పుస్తకానికి, టీవీకీ తేడా ఏంటి?
    పుస్తకం మన దగ్గరికి వస్తుంది; మనం టివి దగ్గరికి వెళ్తాం!