1. రోజూ తల దువ్వుకోటానికి బద్ధకించే బద్ధకాల రావు చివరికి ఏం చేస్తాడు?
జవాబు: 'గుండు చెయ్యి బాబూ' అని సెలూన్ కెళ్తాడు.

2. నిద్రపోతున్న హోంమినిస్టర్ ఎప్పుడు ఉలిక్కిపడతాడు?
జవాబు: భగవంతుడు కలలో కనపడి, "నా గుడికి సెక్యూరిటీ పెంచు" అని అడిగినప్పుడు.

3. మిమిక్రీ ఆర్టిస్ట్ "కుక్కను పెంచుకుందాం" అని భార్యతో అంటే ఆమె ఏమంటుంది?
జవాబు: "మీరుండగా అదెందుకు? " అంటుంది.

4. లైబ్రేరియన్ హోటల్ కెళ్ళి ఎలా ఆర్డరు ఇస్తాడు?
జవాబు: "రెండు ఇడ్లి-ఒక కాఫీ తీసుకురా" అని సర్వర్‌కి చెవిలో చెప్తాడు.

5. ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా వుండాలంటే ఏం చెయ్యాలి?
జవాబు: పరీక్షలు పెట్టటం మానెయ్యాలి.

6. భర్తకు వాంతులు అవుతుంటే టివిలు చూసే తిక్కమ్మ ఏం అనుకుంటుంది?
జవాబు: ఆయన గర్భం దాల్చాడేమో అనుకుంటుంది.

7. నాలుగు లక్షల కట్నం పోసి కొనుక్కున్న భర్త నాలుగు రూపాయిలు కూడా సంపాదించకపోతే?
జవాబు: వినియోగదారుల కోర్టులో వ్యాజ్యం వేయాలి.