ఎగురుతోంది జెండా - ప్రజల గుండె నిండా
పిలుస్తోంది జెండా - భరతభూమి నిండా
మీకోసం నేనంటూ - ఎర్రకోటపైన ఎగసి ..(2)

తొలి పొద్దు పొడుపు నుండి
మలిపొద్దు పొడుపు దాక
ఢిల్లీ ఎర్రకోట నుండి ప్రతిపల్లె గుండెదాక
తరతరాలు తరగని శక్తిని నేనే అందిస్తానంటూ
"ఎగురుతోంది"

సర్వమతాలకు గుర్తులు
ముచ్చటైన మూడు రంగులు
హిందూ ముస్లిం క్రైస్తవ మతాల్ని
ఒకే జాతిగా నిలిపిన జెండా
ధనిక-పేద తేడా అనక ప్రజాస్వామ్యాన్ని పంచుతానని
"ఎగురుతోంది"