గాడిద బొమ్మకు వచ్చిన స్పందనలు చదివారుగా.? ఇప్పుడు ఇక ఈ బొమ్మను చూడండి.. ఎంత అందమైన దుకాణం!

వెదురు బుట్టలు, పేము కుర్చీలు అమ్మే ఈ దుకాణంలోకి పట్నం నుండి ఎవరో వచ్చారు..ఏం కొనుక్కుంటారో, ఎన్ని డబ్బులు ఇస్తారో, దాంతో మరి దుకాణం వాళ్ళు ఎంత బాగుపడతారో..

మీకు తెలుసా, ఆ కథ? తెలిస్తే మాకు రాసి పంపండి. బాగున్న కథని రెండు నెలల తర్వాత కొత్తపల్లిలో ప్రచురిస్తాం. కొత్తపల్లి పత్రిక కాపీ నొకదాన్ని మీకూ అందిస్తాం!

మీ కథలు పంపాల్సిన చిరునామా:
కొత్తపల్లి బృందం, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101