1.వందనోటు కంటె రూపాయి బిళ్ళ ఎందుకు గొప్పది?
జవాబు:రూపాయి బిళ్లతో ఐతే ఫోన్ చేసుకోవచ్చు!
2.ఫోటోగ్రాఫరుకి అసాధ్యమైనదేది?
జవాబు:'చీకటి 'ని ఫోటో తియ్యటం!
3.లెక్కల మేస్టారికి, దేవుడికి పోలిక ఏమిటి?
జవాబు:మనం ఒక సమస్య పూర్తి చేయగానే ఇంకొకటి ఇస్తుంటారు ఇద్దరూ!
4.ఎటువంటి పరిస్థితులలోనైనా బ్రతకగల మొక్క ఏది?
జవాబు: కలుపు మొక్క.
5.లెక్కల మేస్టారి ఇంటినంబరు?
జవాబు:1/2 - 3/4 + 5/9 x 7%8 - 9.
6.భీమా ఏజంట్ పెళ్ళికొడులయితే?
జవాబు:కట్నం కింద కోటిరూపాయిలు పాలసీ తీసుకోమంటాడు.
7.వెజిటేరియన్ యానిమల్స్ అంటే?
జవాబు:శాకాహారులుగా జీవిస్తూ మాంసాహారానికి ఉపయోగపడే జంతువులు.
8. అతి గొప్ప చెప్పుల ప్రకటన?
జవాబు:"కుడి కాలు చెప్పు కొంటే ఎడమకాలి చెప్పు ఫ్రీ"!