1. అల్లిబిల్లి జాబిల్లి
అల్లిబిల్లి జాబిల్లి
అల్లరి చేసే మా తల్లి
పట్టుచీర కట్టింది
బొట్టు కాటుక పెట్టింది
చేతికి గాజులు తొడిగింది
కాళ్లకు గజ్జెలు కట్టింది
నడుముకు వడ్డాణం పెట్టింది
మెడలో హారం వేసింది
జడలో మల్లెలు తురిమింది
తలకి కిరీటం పెట్టింది
ఎత్తు పీట పై కూర్చుంది
తానే రాణని మురిసింది
2. గుడిలో గంట ఉన్నది
గుడిలో గంట ఉన్నది
హారతికి వేళ అయ్యింది
పూజారి గంట కొట్టాడు
గంట గణ గణ మోగింది
3. అందాల నెమలి
నెమలి నెమలి అందాల నెమలి
నెమలికి నేను గింజలు వేస్తే
నెమలి నాకు ఈక ఇస్తే
ఈకను పోయి ఈశ్వరుని ఇస్తే
ఈశ్వరుడు నాకు ఈత నేర్పే
ఈతలోన పోటీ పెడితే
నాకే మొదటి బహుమతి వచ్చే !
4. జంగుకు శంఖం దొరికింది
జంగు శంఖం ఊదాడు
శంఖం భం భం మోగింది
ఆకాశంలో మబ్బులు కమ్మాయి
నెమిలి పింఛం విప్పింది
పింఛం మిల మిల మెరిసింది