ఎంత అందమెంత అందమో-
ఈ జగతిని-
ఎంత అందమెంత అందమో!

గళము తెరిచి పాడితే కోయిల
పూలు పూచి ఊగితే తీవియ
పురివిప్పి ఆడితే మయూరం
పడగెత్తి ఆడితే భుజంగం
"ఎంత అందమెంత అందమో"

పకపకమని నవ్వితే పాపాయి
చిలిపినవ్వు నవ్వితే చిన్నారి
ముసిముసిగా నవ్వితే ముగ్ధవధువు
బోసినవ్వు నవ్వితే బాపూజీ
ఎంత అందమెంత అందమో"

తారలెన్నొ వెల్లివిరియు ఆకాశం
పూలజల్లు రాలిపడే మధుమాసం
పంటచేల పైరుగాలి విన్యాసం
కన్యాకుమారి వరకు కనులపంట నాదేశం
"ఎంత అందమెంత అందమో"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song