ఎగురవే ఎగురవే ఎగురవే జెండా
ఎంతెత్తు ఎగిరినా ఎదురు ఏమున్నది ॥ఎగురవే ॥

ఈ దేశ చరితంబు నవ రస భరితంబు
ఈ దేశ స్వాతంత్ర్య పోరాట ఫలితంబు
మువ్వన్నె వెలుగులా ముద్దు నీ రూపం
ఏడేడు లోకాల ఈ మాట విదితంబు ॥ఎగురవే ॥

ఈ గాలి ఈ నీరు ఈ వెలుగులన్నీ
ఏ ఒకరి సొత్తుగను వర్దిల్లరాదనీ
సమతా మమతల హక్కు సర్వులకు సమమని
ధర్మ చక్రములోని మర్మంబు చాటగా ॥ఎగురవే ॥

కులమతంబుల అడ్డు గోడలు కూలాలి
కుళ్ళు కుత్సితముల నీడలు వీడాలి
మనిషి మనిషికి మధ్య మమతలు పెరగాలి
నీతి నిజాయితీ నీఎత్తు పెరగాలి ॥ఎగురవే ॥

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song