చలికాలం వచ్చింది
సరుకు లేమి తెచ్చింది?
నిప్పులకుంపటి తెచ్చింది
వెచ్చని దుప్పటి కప్పింది
ఎండాకాలం వచ్చింది
ఏమేమి తెచ్చింది?
కాళ్ళకు చెప్పులు తెచ్చింది
నెత్తిన గొడుగు ఎత్తింది
వానాకాలం వచ్చింది
కానుకలేమి తెచ్చింది?
వాగూ వంకా వరదా
వాకిలి ముందర బురదా!