సేకరణ: పి.అలివేలమ్మ, సి.ఆర్., చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.

  • జాబ్ గ్యారంటీ!
    ఓ ఇంజనీరింగ్ కాలేజీలో తమ కొడుకును చేర్పించడానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ముందుజాగ్రత్తగా ‘ఆ కాలేజీలో తమ కొడుకును చేర్చితే బాగుంటుందా’ అని చాలా మందిని విచారించారు.
    చివరికి కాలేజీ గేటు దగ్గర నిలబడ్డ వాచ్ మాన్ ను కూడా అడిగితే బాగుంటుందని, అతన్ని అడిగారు "ఈ కాలేజీలో చేర్పిస్తే మా వాడు పైకొస్తాడా?" అని.
    అతను చెప్పాడు: 'నేనూ ఈ కాలేజీలోనే ఇంజనీరింగ్ చేశాను. ఇదిగో- ఇప్పుడు ఇలా ఇక్కడే పనిచేస్తున్నాను. ఈ కాలేజీలో చదివితే మాత్రం జాబ్ గారంటీ..' అని.

  • ఖర్చు!
    డాక్టరు: రామయ్యా!, నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఓసారి క్లినిక్ కివచ్చావంటే ఈ కుట్లు విప్పి మందు రాస్తాను మరి..
    రామయ్య: ఇంత రేటు పెట్టి కుట్టించుకున్న కుట్లు నాలుగు రోజులకే విప్పేస్తే ఎలా డాక్టర్..

సేకరణ: వి. భాస్కర్(9వ త.), ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.

  • ఎవరి గోల వారిది!
    తండ్రి: బాబూ! నా గుండె ఆగిపోయేలా ఉంది. త్వరగా వెళ్లి మన ఫ్యామిలీ మొత్తాన్నీ పిలుచుకొనిరా..
    కొడుకు: మీరు కంగారు పడకుండా విశ్రాంతి తీసుకోండి. నేను వెంటనే వెళ్లి మన ఫ్యామిలీ లాయర్ ని తీసుకవస్తా..

  • జీవ రహస్యం!
    టీచర్: ఆక్సిజన్ లేకుండా మనిషి జీవితమే లేదు. ఈ వాయువును 1773 లో కనుగొన్నారు.
    విద్యార్థి: మరి 1773 కు ముందంతా మనుషులు ఎట్లా బతికారు సార్?

  • కృతజ్నత!
    రాము: సార్! మా తమ్ముడి ప్రాణాలు కాపాడింది మీరే కదండీ....
    గోపి: అవును
    రాము: మీ ప్రాణాలకు తెగించిమరీ మా తమ్ముడ్ని కాపాడినందుకు చాలా థ్యాక్సండీ..
    గోపి: అవునూ, ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నాడు?
    రాము: వాడు బానే ఉన్నాడు. కానీ..
    గోపి: కానీ...చెప్పు
    రాము: వాడి జేబులో ఒక వంద రూపాయలుండాలి. అవి లేవు. మీరు కానీ ఏమైనా తీశారేమోనని...

  • ఒకే అబద్ధం
    రాము: వెయ్యి అబద్ధాలాడయినా ఓ పెళ్లి చేయమన్నారు. కానీ నేను చూడు ఒక్క అబద్ధం మాత్రమే చెప్పేసి పెళ్లి చేసుకున్నాను.
    సోము: ఇంతకీ ఏమని అబద్ధమాడావు? ఉద్యోగం ఉందనా?
    రాము: కాదు. ఇంతకు ముందు నాకు పెళ్లి కాలేదని!

  • అడుక్కుందాం, రా!
    ధనయ్య: రామయ్యా, నాకు బాగా సంపాదించాలని ఉంది. కానీ అస్సలు కష్టపడకుండా సంపాదించాలి. అలా ఏదైనా మార్గముంటే చెప్పు!
    రామయ్య:ఎందుకులేదు, ఉంది ధనయ్యా! పని చేయకుండా సంపాదించుకునేందుకు రాచ మార్గం అడుక్కోవడమే...!

  • రాత-చదువుత!
    పోలీసు: నీకు చదవటం వచ్చా?
    ఖైదీ: రాయటం వచ్చు, కానీ చదవటం రాదు.
    పోలీసు: అయితే ఈ కాగితం మీద నీ పేరు రాసివ్వు.
    ఖైదీ: (ఏదో గజిబిజిగా రాసేస్తాడు)
    పోలీసు: ఇదేమిటి, ఇలా పిచ్చిపిచ్చిగా రాశావ్! ఏం రాశావో చదువు..
    ఖైదీ: నేను ముందునే చెప్పాను కదండీ- నాకు చదవటం రాదని..రాయటం మాత్రమే వచ్చుననీ ! -"బాల" 1952ఆగస్టు

సేకరణ: నారాయణ, కొత్తపల్లి బృందం.

  • మహాత్ముడు!
    సుబ్బారావు: నా భార్యతోటి చాలా సమస్యగా ఉంటోందిరా! మూడు నెలల క్రితం పదివేల రూపాయలు కావాలంది. నెల గడిచిందో లేదో, ఈసారి పదిహేను వేలు అడిగింది. పోయినవారం ఏకంగా ఇరవై వేలు ఇమ్మన్నది! ఇప్పటికిప్పుడు ఇరవై ఐదు వేలు ఇవ్వమంటోంది! ఇలాగైతే ఎలా బ్రతకాలి, చెప్పు? రామారావు: అబ్బ! అంతంత మొత్తాలా? ఏం చేస్తుందిరా, వాటితో?
    సుబ్బారావు: ఏమో, నాకేం తెలుసు? ఆమె ఎంత మొత్తుకున్నా నేను మాత్రం ఇన్నాళ్లుగా పైసా కూడా ఇవ్వలేదు మరి!

  • ఎదుగుదల!
    రాము: నాన్నా! నువ్వు ఇంకా పెరుగుతున్నావా?
    నాన్న: లేదురా! కొంత పెద్దయిన తర్వాత ఎదుగుదల ఆగిపోతుంది. అయినా నీకెందుకు వచ్చింది, ఆ అనుమానం?
    రాము: మరి నీ తల రోజురోజుకూ బయటికి వచ్చేస్తోంది గదా, జుట్టును దాటుకొని?!