నల్లపిల్లి నల్లపిల్లి ఏడకెళ్తివి?
ఇంగ్లండు దేశానికెళ్లి వస్తిని
ఇంగ్లండు దేశంలో ఏమి చూస్తివి?
ఎల్జబెత్తు రాణిగారి మేడ చూస్తిని
రాణి గారి మేడలోన ఏమి చూస్తివి?
మేడలోన తెల్ల ఎలుక పిల్లచూస్తిని
ఎలక పిల్ల నిన్ను చూసి ఏమన్నది?
బ్లాక్ క్యాట్ గో బ్యాక్ అని అన్నది
ఆమాటకేమని బదులిస్తివి
అచ్చతెలుగులోన దాన్ని తిట్టివస్తిని.