![](/static/images/2008/04/thumbnails/250_500_chilakalukani.jpg?t=1325665258)
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా
రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా?
వన్నెల వన్నెల్ పూల మీద వాలుచున్నారా?
కన్నుల కన్నుల పండుగ చేస్తూ కదులుతున్నారా?
వనమంతా-దినమంతా వసంత శోభలతో
అందాల- ఆనందాల ఆటలాడేరా
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా.