1. నరసింహా రెడ్డి చెప్పినవి:

భూమి గుండ్రం

టీచర్ : రాజూ! భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవు?
రాజు : వెరీ సింపుల్ మేడం! మన గ్రౌండ్ లో నిలబడి కళ్ళు మూసుకొని, గిర గిర తిరిగి కళ్ళు తెరిస్తే తెలుస్తుంది

మొక్కలెందుకు నాటాలి?

టీచర్ : రాజూ! మనం మొక్కలు ఎందుకు నాటాలి?
రాజు: చెట్లు నాటలేం కనుక.

బలమైన చీమ

ఒక కొలనులో కొన్ని చీమలు ఈదుతున్నాయి.

అంతలో ఏనుగులు కొన్ని వచ్చి ఆ కొలనులో దుంకాయి.

ఆ తాకిడికి చీమలన్నీ ఎగిరిపోయాయి.

ఒక చీమ మాత్రం ఎగిరి ఒక ఏనుగుమీద పడింది.

మిగిలిన చీమలన్నీ అరిచాయి ఉత్సాహంగా: "దాన్ని ముంచేయి రా, ముంచేయి!" అని.

చెర్లోపల్లి

టీచర్: రామూ! చెర్లో పల్లి ఎక్కడ ఉంది?

రాము: చెర్లో ఉంది మేడమ్.

2. సి. హేమలత, 6వ తరగతి, MPUP School, CKPalli చెప్పిన జోకులు:

చల్లగా ఉండండి!

భర్త: ఏమే, నీ మెడలో తాళి ఏది?

భార్య: మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఫ్రిట్జ్ లో పెట్టానండీ.

తెలివి తిమ్మరుసు!

తల్లి: ఏరా, చంటీ! చీమలు ఎటు వెళ్తుంటే అటు వెళ్తున్నావ్?

చంటి: ఏమీ లేదమ్మా, నువ్వు లడ్డూలు ఎక్కడ దాచావో తెలీకపోతేనూ..

పావలా కోసం!

ఇద్దరు వ్యక్తులు డాక్టర్ దగ్గరకు వచ్చారు:

డాక్టర్: చెప్పండి, ఏమైంది?

మొదటివాడు: డాక్టరుగారూ నేను పావలా బిళ్లను మింగాను.

డాక్టర్: ఏమీ పరవాలేదు, నేను బయటకు తీసేస్తాను.... మరి మీకేమైంది?

రెండవవాడు: నాకేమీ కాలేదు సార్, ఆ పావలా నాదే, దాన్ని తీసి నాకే ఇస్తారేమోనని వచ్చా.

3. B. నాగార్జున, ZPHS, CKPalli, 7వ తరగతి చెప్పిన జోకులు

గొప్పలు

మొదటి పిల్లవాడు: మా నాన్నకు ఎంత పెద్ద మీసాలున్నాయో తెలుసా?

రెండవ పిల్లవాడు: ఏముంది, మా నాన్నకూ ఉన్నాయి.

మొదటి వాడు: మా నాన్న ఆగకుండా చెరువులో 6 గంటలు ఈతకొట్టగలడు!

రెండవవాడు: దానిదేముంది, మానాన్నకూడా కొడతాడు.

మొదటివాడు: మా నాన్నైతే గోడ అవతల ఉన్నవి కూడా చూడగలడు.

రెండవవాడు: ఆఁ, మా నాన్నకు కూడా కనిపిస్తాయి- నిచ్చెన ఎక్కితే.

ప్లాట్‍ఫారం జాగ్రత్త!

పుల్లారావు రైల్వేస్టేషన్‍కు మొదటిసారి వచ్చాడు. మైక్ లో ఇలా అనౌన్స్ చేస్తున్నారు:

"బొంబాయినుంచి విశాఖకు వెళ్లే 1745 నంబరు గల విశాఖ ఎక్స్ ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబరు ప్లాట్ ఫారం మీదికి రాబోతోంది..."

పుల్లారావు ఇదివిని హడావిడిగా ప్లాట్ పారం మీదినుండి దిగి పరిగెత్తసాగాడు. ఇది చూసిన జనం "ఎందుకలా పరిగెత్తుతున్నావు?" అని అడిగారు.

"మైకు లో చెప్పింది మీరు వినలేదా? రైలు ప్లాట్ ఫారం మీదికి రాబోతోందట, మీరు ప్రాణాలతో మిగలాలంటే మీరుకూడా వెంటనే పరుగెత్తండి" అన్నాడు పుల్లారావు.

పాపం డ్రైవర్!

మారెప్ప హైదరాబాదుకు రావటం అదే మొదటిసారి. అక్కడ డబుల్ డెక్కర్ బస్సునెక్కి కండక్టరు అప్పారావుతో పోట్లాడుతున్నాడు:

మారెప్ప: ఈ నగరంలో మీకు డ్రైవర్లు కూడా దొరకటం లేదా?

అప్పారావు: ఏంటి నీ నస?

మారెప్ప: లేకపోతే ఇదేంటి? ఇద్దరు నడప వలసిన బస్సును ఒక్కడే ఎలా నడుపుతాడు, పాపం?

అప్పారావు: ఆఁ !!!*!!!

అతి తెలివి
రాము: హలో!!

కోతి: హలో!!

రాము: నేను ఎలా అంటే నువ్వూ అలా అనగలవా?

కోతి: సరే.

రాము: నేను పెద్ద మనిషిని.

కోతి: నేను పెద్ద మనిషిని.
రాము: నేను చిన్న మనిషిని.
కోతి: నేను చిన్న మనిషిని.
రాము: నేను బేవార్సును.
కోతి: కరెక్ట్. నువ్వు అదే.

రాము: ఆఁ !!!*!!!

4. మధుశ్రీ, 6వతరగతి, ZPHS, CKPalli చెప్పిన జోకులు:

సంగీతం
భర్త: ఒసేయ్! ఏం చేస్తున్నావ్? పిల్లాడు ఏడుస్తున్నట్లున్నాడు, చూడు!
భార్య: బాబు నిద్ర పోయాడండీ!

భర్త: మరి ఆ ఏడుపేంటి?

భార్య: నేను పాట పాడుతున్నానండీ!

భర్త: ఆఁ !!!*!!!

సుపుత్రుడు

నాన్న: ఒరే, చంటీ! నీకు సోషల్ లో ఎన్ని మార్కులు వచ్చాయిరా?

చంటి: రాము కంటే ఒక మార్కు తక్కువ వచ్చింది నాన్నా!

నాన్న: మరి రామూకు ఎన్ని మార్కులు వచ్చాయి?

చంటి: ఒక్క మార్కు నాన్నా!

నాన్న: ఆఁ !!!*!!!

పరీక్ష

అప్పారావు: ఒరేయ్! నువ్వు ఒకసారి మా యింటికి రారాదూ?

సుబ్బారావు: ఎందుకురా?

అప్పారావు: నేను ఓ కుక్కను కొన్నాను ఈ మధ్యే. అది దొంగలను పసిగడుతుందో లేదో చూద్దామని!