ఒక ఊరిన ఒక కోమటి కలడు. అతని దుకాణమున కోరిన సామానులు కలవు. అతని పేరు సోము. సోము రోజూ దుకాణమునకు పోవును. సోముకు మూడు కోతులు కలవు. వాటిపై అతనికి చాలా మమత. కానీ వాటిని అతడు దుకాణమునకు తీసుకొని పోడు. అవి చేయు పనులు అనిన సోముకు కోపము. కానీ కోతులకు దుకాణమునకు పోవలెనని ఆశ. సోము తమను రానీడని వాటికి తెలుసు. కావున అవి ఒక దినము సోము దుకాణము మూసివేయు సమయమునకు అచటికి చేరినవి. సోముచూడని సమయమున మూటల మాటున దాగినవి. సోము మామూలు సమయమునకు దుకాణము మూసి, తాళము వేసుకొని పోయినాడు. అతను బయటికి పోవుట చూచిన కోతులు మూటల వెనకన దాగుకొనక బయటకు వెడలినవి. ఆ కోతులు అచటగల సామానులు చూచినవి. వాటికి మతులు పోయినవి. అవి అటు, ఇటు పరుగిడినవి. దారినకల సామానులు పడదోసినవి. మూటలలో గలవాటిని నలుదిశలా పారవేసినవి. తినగలిగిన వాటిని తినినవి.
కథలో క్రింది పదాలు ఏవి ఎన్నిసార్లు వచ్చాయి? 1. కోతులు: 2. దుకాణము: 3. కోమటి: 4. బోగము: 5. కిచకిచ: 6. భయము: 7. పారిపోవు: 8. సామానులు: 9. కోపము: