కొండమీద చందమామ కూర్చున్నాడు
పండువెన్నెల నేలమీద పారుజల్లాడు
బాలల్లారా పాపల్లారా పారి రండి
నేలమీద వెన్నెలంత ఏరుకోండి
ఏవరికి ఏది కావాలో కోరుకోండి
చివరికి మీ తావుల్లో చేరుకోండి
రచన: "కవి కాకి" కీ.శే. జై సీతారాం పుస్తకం: మేం పిల్లలం ప్రచురణ: టింబక్టు కలెక్టివ్
జై సీతారాం గారు పిల్లలకోసం రాసిన వందలాది పాటల్లో ఇదో చిన్న మణిపూస. నేలమీద వెన్నెలనంతా ఏరుకోవటం కేవలం పిల్లలకూ, కవికాకికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది, ఈ పాట వింటే.
పాట పాడిన చిన్నారి: గణేశ్
చిత్రం: నరసింహా రెడ్డి,8వ తరగతి.
కొండమీద చందమామ కూర్చున్నాడు
పండువెన్నెల నేలమీద పారుజల్లాడు
బాలల్లారా పాపల్లారా పారి రండి
నేలమీద వెన్నెలంత ఏరుకోండి
ఏవరికి ఏది కావాలో కోరుకోండి
చివరికి మీ తావుల్లో చేరుకోండి