- చెయ్యని కుండా, పొయ్యని నీరు, పెట్టని సున్నం, పెట్టని గిలక ఏమిటిది? జ. కొబ్బరికాయ
- చింపిరి చింపిరి బట్టలు ముత్యాలు వంటి బిడ్డలు ఏమిటది? జ.ముక్కజొన్న
- తోకలేని పిట్ట తొంబై ఆమడలు పోతుంది? ఉత్తరం కాదు, ఏమిటది? జ. e-మెయిల్! 4.ముగ్గురు రాజులకు ఒక్కటే టోపి? జ. తాటికాయ
- అందనంత దూరంలో నల్ల చీర. నిండా లెక్కలేనన్ని తెల్ల పూలు ఏమిటవి? జ. ఆకాశం, చుక్కలు
- ఎండలో కనిపించేది వెంటే వచ్చేది ఏమిటది? జ. నీడ
- అయ్యా అంటే కలవవు - అమ్మా అంటే కలుస్తాయి. ఏమిటవి? జ. పెదవులు
- నాకు కన్ను ఉంటుంది కాని చూడలేను- నేనెవరు? జ. సూది
- తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో దున్నుతారు , నోటితో ఏరుతారు: ఏంటది? జ. పుస్తకం