బొమ్మకు కథ రాయండి!
భయం! ఈ భయం చాలా వింతగా ఉంటుంది. ఇదిగో, వీడికి ఇప్పుడు భయం వేసిందనమాట. భయం వేస్తే ఏం చేయాలి? వీడు పారిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో, ఇంటికేనేమో మరి. లేకపోతే మరి పోలీసు స్టేషనుకైనా కావొచ్చు. ఎందుకు వేసింది భయం? ఏమో, అదీ తెలీదు మాకు. మీకు తెలుసేమో చూడండి. వీడి కథ మాకు రాసి పంపండి. ఎంపికైన కథల్ని కొత్తపల్లిలో ప్రచురిస్తాం! మొదలు పెట్టండి మరి !