వినువీధులలో ఎగిరే జండా-
విశ్వానికి కన్నుల నిండ -
వెదజల్లెను కాంతులు పండ!

ఒకే త్రాటిపై నడిచే ప్రజలు-
ఒకే నీతికై నిలిచే ప్రభులు-
ఒకే దృష్టితో మలచిన మతములు-
ఒకే సృష్టిగా చూచెడి జాతులు (...2)
నా దేశపు ఆదేశాలు లోకానికి సందేశాలు(2) "వినువీధులలో ఎగిరే జండా"

పరదేశపు పీడను బాపగ-
ధైర్యముగా గుండెలు నిలిపి (..2)
శాంతముగా సమరము జరిపి-
స్వాతంత్ర్యం తెచ్చిరి శూరులు(2)
ఆ వీరుల ఆరని జ్యోతి-
నా దేశపు చెదర ని ఖ్యాతి!!(2)
"వినువీధులలో ఎగిరే జండా"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song