నింగి సాగే మబ్బుల్లారా
నీలి పువ్వుల దుబ్బుల్లారా
గాలి తేలి పోతారేమి?
కరిగి కరిగి కురవరేమి? (2)
"నింగి సాగే మబ్బుల్లారా"
చిరు జల్లులు మీరు కురిస్తే
పురి విప్పిన నెమళ్లు మేమై
చిన్నారి పాపలమూ
చిందులేసి ఆడుకుంటాం (2)
"నింగి సాగే మబ్బుల్లారా"
జడివానలు మీరు కురిస్తే
దారులన్ని ఏరులైతే
కాగితాల పడవలు కట్టి
ఊహల్లో ఊళ్లే చూస్తాం (2)
"నింగి సాగే మబ్బుల్లారా"
ఫెళ ఫెళమని పెనుగాలులు వీచి
గాలివానలే మీరు కురిస్తే
హడలిపోయి గడగడమంటూ
అమ్మ ఒడినె హత్తుకుపోతాం (2)
"నింగి సాగే మబ్బుల్లారా"