చిరు చిరునవ్వుల చిలకల్లారా
బంగరు పలుకుల మొలకల్లారా
మనసులు కలిసి మెలగండీ
మనుగడ కదిలీ మెదలండీ (??) “చిరు చిరు”

గాంధీ తాత ఏమయ్యాడు?
మహాత్ముడై వెలుగొందాడు - ఎందుకని?
కొట్టిన వారికి కొట్టలేదులే
తిట్టిన వారిని తిట్టలేదులే
సమతా మమతా మనదన్నాడు
స్వాతంత్ర్యం సాధించాడు
గాంధీ తాతా జోహార్!
మహాత్మకూ మా జోహార్! “చిరు చిరు”

చాచా నెహ్రూ ఏమయ్యాడు?
ఏమయ్యాడు?
శాంతిదూతగా నిలిచాడు - ఎందుకని?
శాంతి పథమ్మే కాంతి మార్గమని
ప్రపంచమంతా చాటాడు
చాచా నెహ్రూ జోహార్!
ఎర్ర గులాబీ జోహార్!
శాంతి దూతకూ జోహార్! “చిరు చిరు”

భారతమాత ఏమంటోంది?- ఏమంటోంది?
క్రమశిక్షణతో నడువంటోంది
నడువంటోంది
మీరే జాతికి పునాదులు
నీతికి నిజానికి రారాజులు
మంచిని మీలో పెంచండి
మనమంతా ఒకటని చాటండి
భారతమాతా జిందాబాద్!
చల్లని తల్లికి జిందాబాద్!
అన్నపూర్ణకూ జిందాబాద్! “చిరు చిరు”

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song