మునుపు రైలునందు మూడు తరగతులు
ఉన్నవారి కొరకు 'ఒకటి'-'రెండు'
బడుగు జనుల కొరకు మూడవ తరగతి-
'మూడు'నందె గాంధి వెడలుచుండె.


రైలుపెట్టె లోన ఐశ్వర్యవంతులు
అమెరికన్లు, గాంధి దరికి చేరి
"గొప్ప నాయకుడవు, చెప్పవలె జవాబు
చేయనేల 'మూడు' పయన మెపుడు?"ధనిక నేల నుండి తరలి వచ్చినవారు
సూటు బూటు కలిగి యున్న వారు
వారి వద్ద గాంధి పలికెను, నవ్వుచు
రైలునందు, లేదు 'నాలుగ'వయది.