రాము తన స్నేహితులతో బంతి ఆట ఆడుతున్నాడు. ఇంతలో బంతి ఎగురుకుంటూ పోయి ఒక చెట్టు తొర్రలో పడింది.

పిల్లలు బంతి కోసం చెట్టు తొర్రలో చేతులు పెట్టారు.

వాళ్లందరినీ చీమలు కుట్టాయి. బంతి మాత్రం దొరకలేదు.

అంతలో రాముకి ఓ మంచి ఆలోచన వచ్చింది.
బిందెతో నీళ్ళు తీసుకొచ్చి తొర్రలో పోశాడు.

బంతి నీళ్లమీద తేలుకుంటూ పైకి వచ్చింది!
పిల్లలంతా రాము తెలివిని మెచ్చుకున్నారు.