
పువ్వులం పువ్వులం
అందమైన పువ్వులం
రంగు రంగుల పువ్వులం
హాయిని గొలిపే పువ్వులం
ఎర్రని గులాబి నేను
అందరు మెచ్చే పువ్వును

కొలనులోని కలువను నేను
దేవుడు మెచ్చే పువ్వును

తెల్లా తెల్లని జాజిని నేను
సువాసన ఇచ్చే పువ్వును

పుసుపు పచ్చని చామంతిని నేను
పడతుల సిగలో పువ్వును

ఎర్ర ఎర్రని మందారాన్ని నేను
అందరికీ ఇష్టమైన పువ్వును

మరులు పెంచే మల్లెను నేను
సువాసన వెదజల్లే పువ్వును

పువ్వులం పువ్వులం
అందమైన పువ్వులం
రంగు రంగు పువ్వులం
హాయిని గొలిపే పువ్వులం