అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పిసినారి వాడు ఉండేవాడు. వాడి పేరు రాముడు.

ఒకరోజు వాడు ఒక పిల్లిని కొనడానికి జంతువుల అంగడికి వెళ్లాడు. అక్కడ పిల్లిని చూసి" ఈ పిల్లి ఎంత?" అని అంగడి వాడిని అడిగాడు.






"నాలుగు రూపాయలు" అన్నాడు అంగడివాడు.







అప్పుడు రాముడు "రెండు రూపాయలకు ఇస్తావా?" అని అడిగాడు.






"ఇవ్వను. నువ్వు నా అంగడి శుభ్రం చేస్తే అప్పుడు ఈ పిల్లిని రెండు రూపాయలకు ఇస్తాను" అన్నాడు అంగడి వాడు.

సరే అని అంగడి నంతా శుభ్రం చేశాడు రాముడు, తుమ్ము-కుంటూ.





ఆ తర్వాత సంతోషంగా రెండు రూపాయలు ఇచ్చి పిల్లిని తీసుకొని ఇంటికి వెళ్లాడు.








కానీ అంగడి శుభ్రం చేసినందుకు వాడికి జ్వరం వచ్చింది.







రెండు రూపాయలు ఆదా చేద్దామనుకుంటే హాస్పిటల్‌ ఖర్చులు రెండు వందలయ్యాయి.