స్వాగతమండీ స్వాగతం
చిన్నిపిల్లల స్వాగతం
మృదువుగ ఇచ్చే స్వాగతం
ముద్దులుఒలికే స్వాగతం    ।స్వాగతమండీ ।

చిన్ని పిల్లలమొచ్చినాము
ఆటలు బాగా ఆడెదము
పాటలు కూడా పాడెదము
ఆటలు పాటలతో మేము 
ఆనందముగా ఉండెదము  ।స్వాగతమండీ ।

చాచా నెహ్రూ మా నేస్తం
ఎర్ర గులాబి మాకిష్టం
శాంతి కపోతం‌ ఆదర్శం 
హరివిల్లే మా ఆనందం  ।స్వాగతమండీ ।
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song