
అందరమూ ఒకటే- మనమందరమూ ఒకటే మన మందిరమూ ఒకటే మన మందిరమూ ఒకటే అందరి చరిత్ర ఒకటే అందరి ప్రవర్తనొకటే! భావిచరిత్ర వర్తనమంతా ఒకటేనంటూ రాయుదుమింక ।అందరమూ । మతములు వేరు మనుగడ ఒకటే జాతులు వేరు నీతులు ఒకటే మతములు జాతులు వేరుగనున్నా భారతీయమది అందరిదీ ।అందరమూ । భాషలు వేరు! భావములొకటే భాషలతల్లి! సంస్కృతమొకటే భాష భావముల భేదములున్నా భారత హృదయము అంతా ఒకటే ।అందరమూ । విద్యలు ఒకటే! కళలు ఒకటే వినోద విజ్ఞానమ్ములు ఒకటే భిన్నత్వమ్మున ఏకత్వమ్మలె వివిధ భారతి హృదయమ్మొక్కటే ।అందరమూ ।