
శిరసెత్తుగగనంబుదాక చిరయశము దశదిశలు ప్రాక ఓ భారత పతాక శాంతి సౌభాగ్యరేఖ శిరసెత్తుగగనంబుదాక చిరయశము దశదిశలు ప్రాక ఎపుడు లాల్ ఖిల్లాపై ఎగిరేవు నీవు అపుడే తెల్లదొరతనము దాటినది రేవు ఎపుడు స్వేచ్ఛాశంఖం ఊదితివో నీవు అపుడే బానిసతనము బడచినది చావు ఓ భారత పతాక శాంతి సౌభాగ్యరేఖ శిరసెత్తుగగనంబుదాక శిరయసము దశదిశలు ప్రాక నువు నడుచు దారులలో అడ్డుకనరాక నీకెవరు లోకమున శత్రువులు లేక ఈగాలి ఈ నీరు సోకునందాక ఏభయము లేక ప్రజ జీవించునుగాక శిరసెత్తుగగనంబుదాక చిరయశము దశదిశలు ప్రాక ఓ భారత పతాక శాంతి సౌభాగ్యరేఖ శాంతి సౌభాగ్యరేఖ శాంతి సౌభాగ్యరేఖ