కోడిపుంజు కోడిపుంజు టైమెంత టైమెంత?
ఐదు గంటలు కొక్కొరొకో ఐదు గంటలు కొక్కొరొకో
తూరుపుసూరీ తూరుపు సూరీ టైమెంత, టైమెంత?
ఆరుగంటలు అబ్బాయీ, ఆరుగంటలు అమ్మాయీ.
గడియారం గడియారం టైమెంత టైమెంత?
ఏడు గంటలు టంగ్ టంగ్ టంగ్ , ఏడు గంటలు టంగ్ టంగ్ టంగ్
బడిగంటా బడిగంటా టైమెంత, టైమెంత?
ఏడున్నర గణ గణ గణ, ఏడున్నర గణగణగణ
నిద్రపోయే మొద్దురాముడూ టైమెంత, టైమెంత?
ఎనిమిది గంటలు గుర్ గుర్ గుర్ ఎనిమిది గంటలు గుర్ గుర్ గుర్.