ఈ బొమ్మను చూడండి. ఏనుగు, పాప ఇద్దరూ ఆకాశపు అంచున, రాళ్ల గోడమీద కూర్చొని ఏం చెప్పుకుంటున్నారో మరి? దీన్ని చూస్తే మా మనసులో చాలా ఆలోచనలు గింగిరాలు తిరిగాయి. మరి మీకు? వీళ్ళిద్దరూ ఇట్లా ఎందుకు కూర్చున్నారో, ఆ కథ ఏంటో ఊహించి, చక్కగా రాసి పంపండి మాకు. ఆ కథల్లో బాగున్నవాటిని కొత్తపల్లి-100 వ పుస్తకంలో ప్రచురిస్తాం!