ఆఫీసర్ అదిరిపడేదెప్పుడు!? జవాబు: జాయినింగ్ రిపోర్టు తీసుకున్న ఉద్యోగి "జీతం ఎప్పుడిస్తారుసార్" అని అడిగినప్పుడు!!
విమానాశ్రయం దగ్గర బిచ్చగాడి స్లోగన్ ...!? జవాబు: ఒక డాలరు ధర్మం చెయ్యండి బాబూ! ఒక డాలరు ధర్మం చెయ్యండమ్మా!!
బటర్ ఫ్లై అంటే.....!? జవాబు: వెన్న మీద వాలే ఈగ!!
ఇదివరకైతే "ఓ కార్డు ముక్క రాస్తే చాలు!" అనేవారు. మరిప్పుడు!? జవాబు: "మిస్డ్ కాలు ఇస్తేచాలు"
ఆధునిక భస్మాసురులు ఎవరు!? జవాబు: తాము ప్రయాణించే బస్సులు తామే తగలబెట్టుకునేవాళ్ళు.
బయట వుండే వాయువు శరీరంలో వుంటే....!? జవాబు: ఆయువు.
సోమరిపోతును ఎవరైనా 'చావరాదా ' అని తిడితే ...!? జవాబు: 'బద్ధకంగా వుంది బాబూ' అంటాడు.
ఇవ్వటానికి ఇష్టపడేది, తీసుకోటానికి ఇష్టపడనిది.....? జవాబు: సలహా
రిటైరయిన సిటీబస్‌డ్రయివర్ బైక్ మీద కూర్చున్న భార్య విసుక్కునేదెప్పుడు!? జవాబు: భర్త బైకును ప్రతి బస్‌స్టాపు దగ్గరా ఆపుతున్నపుడు!!
కరిగిపోయినా తరిగి పోనిదేమిటి? జవాబు: కాలం!!