కథ విప్పండి!

1. దేహమంతా కళ్ళు ఉండును, కాని దేవేంద్రుడిని గాను. నరుడి తోడు లేక నడువలేను, నేను ప్రాణిని కాను. పట్టి ప్రాణాలు తీస్తాను. నేనెవరిని నేనెవరిని?

2. చల్లని బంతి తెల్లని బంతి- అందని బంతి ఏమిటది?

3. జీడివారి కోడలు,సిరిగల వారికి ఆడపడుచు, వయసులో కులికే వయ్యారి- వైశాఖ మాసంలో వస్తుంది. ఏమిటది?

4. గూటిలో ఉంటాము గువ్వలం కాము, చుట్టూ కాపలా ఉంటుంది కాని రాజులు కాము,న్యాయధర్మాలు తెలిసినా న్యాయమూర్తులం కాము, ఎవరు మేము ఎవరు?

5. సన్నని దంతాలున్నాయి కాని ఎలుకను కాను, కుచ్చుతోక నాకున్నది కాని నక్కను కాను, చేసితిని శ్రీరామునికి సాయం- కానీ కోతిని కాను మరినేనెవరిని?

6. పదములారు కలవు బంభరంబు కాదు, తొండం ఉంది గాని దోమకాదు, రెక్కలుండు గాని పక్షి కానేరదు- అయితే మరేమిటి?

7. కాను(?) మీద మాను కడు రమ్యమై యుండు- మాను మీద లతలు మలయుచుండు- లతల మీద వేళ్ళు నాట్యమాడు- నేనెవరిని?

కథ విప్పండి! (జవాబులు)   
1. వల      
2. చందమామ     
3. మామిడి పండు     
4. కళ్ళు   
5. ఉడత   
6. ఈగ      
7. వీణ

సేకరణ: ప్రమీల, రామచంద్ర, 3వతరగతి, చెన్నేకొత్తపల్లి.