1.కరెన్సీ నోటులో తెల్లని భాగం దేనికి!? జవాబు: రఫ్ వర్కు చేసుకోటానికి. 2.'అర్ధరాత్రి ' కి వ్యతిరేక పదం చెప్పమన్న తెలుగు మాస్టారు తలపట్టుకునేదెప్పుడు!? జవాబు: 'అర్ధపగలు ' అని విద్యార్ధి అన్నప్పుడు. 3.అమ్మ అదిరిపడేదెప్పుడు!? జవాబు: ఒకటోతరగతి చదివే కొడుకు "హోంవర్క్ చెయ్యటానికి నెట్ సెర్చ్ చేస్తున్నాను" అన్నప్పుడు. 4.పిల్లలు దేవుడితో సమానం, మరి వృద్ధులు.....!? జవాబు: ఆస్తి వుంటే దేవుళ్ళు - లేకపోతే దెయ్యాలు. 5.పురాణ కాలంలో ప్రపంచ బ్యాంకుని ఏమని పిలిచేవారు? జవాబు: కుబేరుడు. 6. కలికాలం అంటే? జవాబు: 'అన్నమో రామచంద్రా' అన్న తోటి వాడికి అన్నం పెట్టకుండా ఆకలనే అడగని రామచంద్రుడికి నైవేద్యం పెట్టటం. 7.జాతకం చూపించుకోటానికి ఎవరి దగ్గరకెళితే మంచిది? జవాబు: జాతకం చూసేవాళ్ళలో ఎవరి జాతకం బాగుందో తెలుసుకుని, అతని దగ్గరకెళ్తే మంచిది.