ఎత్తండి! ఎత్తరే, స్వాతంత్య్రపు జండాని?

ఒకే కంఠం ఒకే గమ్యం

ఒకే నినాదం మనదంట

ఒకే జాతి ఒకే నీతి

ఒకే పతాకం మనదంట ॥

భాషా వేషం ఏదైనా,

భారతీయులం మనమంతా

ఊరు పేరు వేరైనా

ఒకే కుటుంబం మనదంతా

ఒకే కంఠం ఒకే గమ్యం

ఒకే నినాదం మనదంట

ఒకే జాతి ఒకే నీతి

ఒకే పతాకం మనదంట ॥

జైహింద్ జయహే మనమాట

జనగణమన మన పాట

సమైక్యతే మన బాట

స్వాతంత్ర్యం మన తోట

ఒకే కంఠం ఒకే గమ్యం

ఒకే నినాదం మనదంట

ఒకే జాతి ఒకే నీతి

ఒకే పతాకం మనదంట ॥

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song