చల్లనైనదమ్మ మా బడి ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి చదువుల పువ్వులు పూసే- ఇది నవ్వుల పూదోట కమ్మని వెన్నెల కాచే- సిరి మల్లెల విరిబాట |చల్లనైనదమ్మా| గోరుముద్దల్లాంటి- కథలెన్నో మేము విన్నాం మెదడుకు మేతను పెట్టే- పాఠాలు మేము చదివాం గురువులు మలిచిన శిల్పాలై ఈనాడు నిలిచాము దిశలకు వెలుగులు పంచే దీపాలమైనాము |చల్లనైనదమ్మా| కోయిలమ్మలకంటే భలె కమ్మని పాటలు నేర్చి లేడి కూనలకంటే చెంగ్ చెంగున గంతులు వేసి భారతమాతను కొలిచే త్యాగయ్యలమౌతాము భారతమాతను కాచే వీర సైనికులౌతాము |చల్లనైనదమ్మా|