కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా! నిన్నెవరేమన్నారే కోయిలపిల్లా ఆదివారంనాడొస్తాం పిల్లా నీకు అందాల పట్టు చీర తెస్తాం పిల్లా |కోయిలపిల్లా| సోమవారంనాడొస్తాం పిల్లా నీకు అందాల గాజులు తెస్తాం పిల్లా |కోయిలపిల్లా| మంగళవారంనాడొస్తాం పిల్లా నీకు మంగళసూత్రం తెస్తాం పిల్లా |కోయిలపిల్లా| బుధవారంనాడొస్తాం పిల్లా నీకు అందాల పట్టీలు తెస్తాం పిల్లా |కోయిలపిల్లా| గురవారంనాడొస్తాంపిల్లా నీకు నడుముకు డాబులు తెస్తాం పిల్లా |కోయిలపిల్లా| శుక్రవారంనాడొస్తాం పిల్లా నీకు చెవులకు కమ్మలు తెస్తాం పిల్లా |కోయలపిల్లా| శనివారంనాడొస్తాం పిల్లా నీకు సొమ్ములుగిమ్ములు తెస్తాం పిల్లా |కోయిలపిల్లా|