బొమ్మకు కథ రాయండి!
ఇప్పుడే తెల్లవారినట్లుంది.. లేకపోతే మరి అడవి తగలబడుతోందో? వీళ్ళెవరో అన్నా చెల్లెళ్ళ లాగున్నారు కదా? స్కూల్ నుండి నేరుగా అడవికి ఎందుకెళ్ళిపోయారో మరి?! ఈ ఏనుగులు రెండూ వాళ్లకి దొరికాయా, లేకపోతే వాళ్ళే ఈ ఏనుగులకు దొరికారా? ఇద్దరూ తప్పిపోతే ఏనుగులు కాపాడి వెనక్కి తెస్తున్నాయేమో? లేకపోతే వాటినే వీళ్ళిద్దరూ అడవిలో వదిలేందుకు బయలు దేరారా? ఆ ముచ్చట్లతో ఓ చక్కని కథ రాసి పంపండి మరి! కథ బాగుంటే కొత్తపల్లి-103 లో ప్రచురిస్తాం!